TG Fee Reimbursement : ఇక విద్యార్థి ఖాతాలోకే ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు - 75 శాతం హాజరు తప్పనిసరి, కొత్త రూల్స్ ఇవే
భారతదేశం, జూన్ 10 -- Telangana Fee Reimbursement New Rules : గత కొంతకాలం రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల చెల్లింపుల విషయంలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. కొన్ని ప్రైవేట్ కాలేజీలు హైకోర్టును కూడా ఆశ్రయించాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ సర్కార్. కీలక సంస్కరణలను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గతంలో ఉన్న జీవోను రద్దు చేసి. కొత్త నిబంధనలను అమలు చేయనుంది.
గతంలో మాదిరిగా కాలేజీల ఖాతాలోకి కాకుండా.. విద్యార్థుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకే నేరుగా నగదు బదిలీ (Direct Benefit Transfer - DBT) చేయనున్నారు. ఇందుకోసం గతంలో అమలులో ఉన్న జీవో నం.7ను రద్దు చేస్తూ.. కొత్త నిబంధనలతో బోధన ఫీజుల నోడల్ విభాగమైన ఎస్సీ సంక్షేమశాఖ సరికొత్త ఉత్తర్వులు (జీవో నం.9) జారీ చేసింది. ఈ మార్పులు రాబోయే 2026-27 విద్యాసంవత్సరం నుంచి అధికారికంగా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.