భారతదేశం, అక్టోబర్ 6 -- తెలంగాణలో సామాన్య విద్యుత్ వినియోగదారులపై కరెంటు బిల్లుల భారం మోపేందుకు రంగా సిద్ధమైంది. రాష్ట్రంలోని నాన్-అగ్రికల్చర్ (వ్యవసాయేతర) వినియోగదారుల నుంచి ఏకంగా రూ.5,420.23 కోట్ల మేర 'ట్రూ-అప్' ఛార్జీలను వసూలు చేయడానికి విద్యుత్ పంపిణీ సంస్థలైన డిస్కంలకు అనుమతినిస్తూ తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ) కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఈ నిర్ణయంతో గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల నెలవారీ కరెంటు బిల్లులు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.

వచ్చే నెల నవంబరు నుంచి జారీ చేసే కరెంట్ బిల్లుల నుంచే ఈ ట్రూ-అప్ వసూళ్లను ప్రారంభించాలని డిస్కంలకు ఈఆర్‌సీ తేల్చిచెప్పింది. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో ప్రతి కనెక్షన్‌కు వినియోగించిన యూనిట్ల ఆధారంగా ఈ పెంపు లెక్కించనున్నారు.

రాష్ట్రంలో ఉచిత విద్యుత్ విధానం అమల...