భారతదేశం, ఫిబ్రవరి 21 -- రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎడ్ సెట్ - 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా 2026-27 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు కల్పిస్తారు.
ఫిబ్రవరి 23వ తేదీ నుంచి తెలంగాణ ఎడ్సెట్ ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 18వ తేదీ వరకు ఎలాంటి ఫైన్ లేకుండా అప్లయ్ చేసుకోవచ్చు. రూ. 250 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 22 వరకు అవకాశం కల్పించారు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు కింద సాధారణ అభ్యర్థులు రూ.750 చెల్లించాలి. ఇక ఎస్సీ,ఎస్టీ,దివ్యాంగులకు రూ.550 గా నిర్ణయించారు.
టీజీ ఎడ్సెట్ ఎగ్జామ్ రాయాలంటే. డిగ్రీ పూర్తి అయిన అభ్యర్థులు అర్హులవుతారు. వారి విద్యా అర్హతల ఆధారంగా సంబంధిత సబ్జెక్టును ఎంచుకుంటారు. మొత్తం 150 మార్కులకు ఎగ్జామ్ నిర్వహిస్తారు. 2 గంటల సమయం ఉంటుంది. https:/...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.