భారతదేశం, మే 11 -- TG EdCET 2026 Hall Ticket Download: రాష్ట్రంలోని బీఈడీ (B.Ed) కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 పరీక్షకు సర్వం సిద్ధమైంది. తాజాగా ఈ ఈ ఎంట్రెన్స్ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. అధికారిక వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటంది.

మే 12న జరగనున్న ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ బీఈడీ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ అడ్మిషన్లు కల్పిస్తారు. మే 12న ఉదయం 10:00 నుండి 12:00 వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2:00 నుంచి 4:00 వరకు మరో సెషన్ ఉంటుంది.

టీజీ ఎడ్ సెట్ ప్రాథమిక కీ మే 15న విడుదల కానుంది. వీటిపై అభ్యంతరాలను కూడా స్వీకరిస్తారు. మే 30న తుది ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది.

హాల్ టికెట్‌తో పాటు అభ్యర్థులు తప్పనిసరిగా ఒక చెల్లుబాట...