భారతదేశం, మే 29 -- రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో లాటరల్ ఎంట్రీ (నేరుగా రెండో సంవత్సరం) ప్రవేశాల కోసం నిర్వహించిన 'తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్' (TG ECET) 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి ఆదేశాల ప్రకారం ప్రవేశ పరీక్షను విజయవంతంగా నిర్వహించిన జేఎన్‌టీయూ హైదరాబాద్ (JNTUH) అధికారులు ఈ ఫలితాలను.. అభ్యర్థుల ర్యాంక్ కార్డులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులతో పాటు బీఎస్సీ (గణితం) చదివిన వేలాది మంది అభ్యర్థులు ఈ ఏడాది ఈసెట్ పరీక్షకు హాజరయ్యారు. కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో (CBT) జరిగిన ఈ పరీక్షకు సంబంధించిన రెస్పాన్స్ షీట్లు, ప్రాథమిక కీ (Preliminary Key) పై అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. అభ్యంతరాలన్నింటినీ నిపుణుల కమిటీ పరిశీలించిన అనంతరం.... అభ్యర్థుల...