భారతదేశం, ఏప్రిల్ 23 -- రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఈఏపీసెట్ కి సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. అగ్రికల్చర్ - ఫార్మసీ స్ట్రీమ్ విభాగం పరీక్షలు మే 4, 5 తేదీల్లో జరగనున్నాయి. అయితే వీటికి సంబంధించిన హాల్‌టికెట్లు నేటి నుంచి అందుబాటులోకి వస్తాయి. ఉదయం 11 గంటల తర్వాత వెబ్‌సైట్‌ ( eapcet.tgche.ac.in ) ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఇక ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు మే 9, 10, 11 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ అభ్యర్థులు వారి హాల్‌టికెట్లను ఏప్రిల్ 27వ తేదీ మధ్యాహ్నం నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది ఎప్‌సెట్ రాయడానికి విద్యార్థుల నుంచి భారీ స్పందన లభించింది. ఇంజినీరింగ్ విభాగానికి ఏకంగా 2,10,308 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. అగ్రికల్చర్ మరియు ఫార్మసీ విభా...