భారతదేశం, జూన్ 29 -- TG EAPCET Counseling 2026 : ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తోన్న టీజీ ఎప్‌సెట్ (TG EAPCET) కౌన్సెలింగ్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. మొదటి విడత కౌన్సెలింగ్‌కు సంబంధించిన స్లాట్ బుకింగ్ ప్రక్రియ సోమవారంతో (జూన్ 29) ముగియనుందని ప్రవేశాల కన్వీనర్ శ్రీదేవసేన ఆదివారం ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించారు.

ఆదివారం నాటికే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 92 వేల మంది విద్యార్థులు తమ స్లాట్లను బుక్ చేసుకున్నారు. స్లాట్ బుకింగ్ విజయవంతంగా పూర్తి చేసుకొని, ధ్రువపత్రాల పరిశీలన ముగిసిన అభ్యర్థులు మాత్రమే వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి అర్హులవుతారని అధికారులు స్పష్టం చేశారు.

స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు జూన్ 29 లోపు తమకు కేటాయించిన, నిర్దేశిత హెల్ప్‌లైన్ కేంద్రాలకు (HLC) సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం వ్యక్తిగతంగా హాజరుకావాల్సి...