భారతదేశం, జూలై 16 -- TG EAPCET 2nd Phase Counselling : ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఈఏపీసెట్ (TG EAPCET) రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. జూలై 17వ తేదీ నుంచి రెండో విడత కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు, స్లాట్ బుకింగ్ ప్రక్రియ మొదలవుతుంది. మొదటి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ ముగియడంతో.. ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం ఈ విడత కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్నారు.

రెండో విడత కౌన్సెలింగ్‌లో భాగంగా జూలై 18వ తేదీన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన (సర్టిఫికెట్ వెరిఫికేషన్) చేపడతారు. ఆ తర్వాత జూలై 18, 19 తేదీల్లో అభ్యర్థులు తమకు నచ్చిన కాలేజీలు, కోర్సులను ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. ఆప్షన్లు నమోదు చేసుకున్న అభ్యర్థులకు జూలై 22న లేదా ఆ లోపు రెండో విడత సీట్లను కేటాయిస్తామని ప్రవేశాల కార్యాలయం స...