భారతదేశం, మే 14 -- TG EAPCET 2026 Results : రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఈఏపీసెట్ ఫలితాలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే ప్రాథమిక కీలను విడుదల చేయగా.. తుది ఫలితాలను ప్రకటించేందుకు జేఎన్టీయూ కసరత్తు చేస్తోంది. అన్ని కుదిరితే ఈనెల 25వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఈ తేదీ కుదరకపోతే ఒకరోజు అటు ఇటు కావొచ్చని సమాచారం. మొత్తంగా. ఈనెలాఖారులోపే ఈ ఫలితాలను ప్రకటించే సూచనలున్నాయి.

పరీక్షలు విజయవంతంగా ముగియడంతో,. ప్రస్తుతం ఫలితాలను ప్రాసెసింగ్ చేస్తున్నారు. ఇప్పటికే అగ్రికల్చర్, ఫార్మసీ ప్రాథమిక కీలపై అభ్యంతరాలను స్వీకరించారు. ఇక ఇంజినీరింగ్ స్ట్రీమ్ ప్రాథమిక కీపై అభ్యంతరాలకు ఇవాళ్టితో గడువు పూర్తి కానుంది. ఈ గడువు ముగిస్తే. అభ్యంతరాలను పరిశీలించి. తుది కీలతో పాటు ర్యాం...