భారతదేశం, జూన్ 8 -- తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఈఏపీసెట్ (TG EAPCET) 2026 కౌన్సెలింగ్ అధికారిక షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది ప్రవేశాల ప్రక్రియను వేగంగా ముగించి, సకాలంలో అకడమిక్ ఇయర్ ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు.

మూడు విడతల్లో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియను అధికారులు నిర్వహిస్తారు. జూన్ 19వ తేదీ నుంచి మెుదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ మెుదలవుతుంది. జూన్ 28వ తేదీదాకా స్లాట్ బుకింగ్ అవకాశం ఉంటుంది. జూన్ 22 నుంచి 29 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉండనుంది. జూన్ 25 నుంచి జూలై 1వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు అవకాశం కల్పిస్తారు. జూలై 4వ తేదీన మాక్ సీట్ అలకేషన్ నిర్వహిస్తారు. జూలై...