భారతదేశం, జూలై 5 -- TG EAPCET Mock Seat Allotment 2026 : టీజీ ఈఏపీసెట్ -2026 ప్రవేశాల ప్రక్రియకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. తొలి విడత కౌన్సెలింగ్‌కు సంబంధించి శనివారం (జులై 4) అధికారులు మాక్‌ అలాట్‌మెంట్‌ను పూర్తి చేశారు. ఈ ప్రాసెస్ లో మొత్తం 79,313 మంది విద్యార్థులకు మాక్‌ సీట్లను కేటాయించారు. అభ్యర్థులు వెబ్ ఆప్షన్లలో నమోదు చేసుకున్న కాలేజీలు, కోర్సుల ప్రాధాన్యత ఆధారంగా ఈ కేటాయింపులు జరిగాయి.

విద్యార్థులు తమ వ్యక్తిగత లాగిన్ ఐడీ నంబర్‌, ఎప్‌సెట్‌ హాల్‌టికెట్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌, పుట్టిన తేదీ మరియు క్యాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేసి తమ మాక్‌ అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ను సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్ సైట్ ( https://tgeapcet.nic.in ) నుంచి మాక్ అలాట్ మెంట్ వివరాలను చెక్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ...