భారతదేశం, మార్చి 30 -- రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఈఏపీసెట్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే దరఖాస్తులకు గడువు దగ్గరపడుతోంది. ఎలాంటి ఫైన్ లేకుండా ఏప్రిల్ 4వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. సమయం దగ్గరపడుతున్న వేళ. వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అదికారులు సూచిస్తున్నారు.

ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా 2026 -2027 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కల్పిస్తారు. ఫైన్ తో అయితే. మే 2 వరకు అవకాశం కల్పించారు. ఇప్పటికే పలు జిల్లాల్లో పరీక్షా జోన్‌లను ఎంచుకునే అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే అధికారులు వాటిని బ్లాక్ చేశారు. మహబూబ్‌నగర్, నల్గొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్‌లలో పరీక్షా జోన్లను స్తంభింపజేసింది. ఈ జిల్లాల నుండి అధిక సంఖ్యలో దరఖాస్తులు అందాయి.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16 టెస్ట్ జ...