భారతదేశం, జూన్ 2 -- TG DOST Web Options 2026 : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది. డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (TG DOST) 2026 విద్యాసంవత్సరానికి గానూ మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.

ఇప్పటికే రిజిస్ట్రేషన్లు ప్రారంభంగా. అత్యంత కీలకమైన వెబ్ ఆప్షన్లు ఎంచుకునేందుకు ఉన్నత విద్యామండలి అవకాశం కల్పించింది. ఈ మూడో విడత వెబ్ ఆప్షన్ల ప్రక్రియ జూన్ 16వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. డిగ్రీలో చేరాలనుకునే అభ్యర్థులు తమకు నచ్చిన కాలేజీలు, గ్రూపులు, కోర్సులను ప్రాధాన్యత క్రమంలో అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఎంచుకోవాల్సి ఉంటుంది.

మూడో విడత కౌన్సెలింగ్‌లో భాగంగా విద్యార్థులు సమర్పించిన వెబ్ ఆప్షన్లను అధికారులు పరిశీలిస్తారు. అభ్యర్థుల మెరిట్ మార్కులు, రిజర్వేషన...