భారతదేశం, జూలై 26 -- TG DOST 2026 Special Phase Counseling : రాష్ట్రంలో డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ ప్రత్యేక విడతకు సంబంధించిన రిజిస్ట్రేషన్ గడువు నేటితో (జూలై 26, 2026) ముగియనుంది. అర్హత గల విద్యార్థులు ఎటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఉన్నత విద్యామండలి సూచించింది.

ఇంతవరకు దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియలో అసలు రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులు, అలాగే గత మూడు విడతలలో దరఖాస్తు చేయని వారు ఈ ప్రత్యేక విడతలో కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి పూర్తిగా అర్హులవుతారు. గతంలో దోస్త్ ఐడీ పొంది, ఇప్పటివరకు జరిగిన ఏ విడతలోనూ సీటు సాధించలేకపోయిన అభ్యర్థులు తమ పాత ఐడీ మరియు పిన్ (PIN) ఉపయోగించి నే...