భారతదేశం, మే 8 -- TG DOST 2026 Web Options : డిగ్రీ అడ్మిషన్ల కోసం దోస్త్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు కీలక అప్డేట్. ఇప్పటికే మొదటి విడత రిజిస్ట్రేషన్లు పూర్తి అయిన నేపథ్యంలో.. వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ గడువు కూడా నేటితో (మే 08) పూర్తి కానుంది. కాబట్టి ఫస్ట్ ఫేజ్ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు. తప్పకుండా వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

దోస్త్ ప్రక్రియలో వెబ్ ఆప్షన్ల ఎంపిక అత్యంత కీలకమైన ప్రాసెస్. విద్యార్థులు ఇచ్చే ప్రాధాన్యత క్రమం ఆధారంగానే సీట్ల కేటాయింపు జరుగుతుంది. అభ్యర్థులు ఎన్ని ఆప్షన్లనైనా ఇచ్చుకోవచ్చు. ఒక్కసారి ఆప్షన్లు ఇచ్చాక. గడువు ముగిసే వరకు వాటిని ఎన్నిసార్లైనా మార్చుకునే సదుపాయం ఉంటుంది. కానీ వెబ్ ఆప్షన్లు ఎంచుకోకపోతే సీట్ల కేటాయింపు ఉండదు. కాబట్టి ఆయా విద్యార్థులు...