భారతదేశం, జూలై 25 -- Telangana D Pharmacy Admission Notification 2026 : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో రెండేళ్ల డిప్లొమా ఇన్ ఫార్మసీ (డీ-ఫార్మసీ) కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కల్పిస్తారు. ఈ వివరాలను రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (SBTET) వెల్లడించింది.అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులను పూర్తి చేసి సమర్పించవచ్చు.

అభ్యర్థులు దరఖాస్తులను పూరించి, అవసరమైన ధ్రువపత్రాల జిరాక్స్, ఫీజు రశీదుతో కలిసి హైదరాబాద్‌లోని మాసాబ్‌ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్‌కు స్వయంగా గానీ లేదా నిర్ణీత కేంద్రాల్లో గానీ అందజేయాల్సి ఉంటుంది. ఆగస్టు 13, 14 తేదీల్లో ఉదయం 9:00 గంటలకు మాసాబ్‌ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీలో జరిగే కౌన్సెలింగ్‌కు ...