భారతదేశం, సెప్టెంబర్ 22 -- TG CPGET 2026 Phase 2Counselling : తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పిజి, పిజి డిప్లొమా, ఐదేళ్ల కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ సీపీగెట్-2026 (TG CPGET 2026) రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. మొదటి విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనని విద్యార్థులు లేదా సీటు సాధించలేకపోయిన వారు ఈ రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనొచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://cpgetadmissions.com ను సందర్శించి వివరాలు నమోదు చేసుకోవాలి.

అభ్యర్థులు సాధించిన ర్యాంకులు, రిజర్వేషన్ల ఆధారంగా సీట్లను అక్టోబర్ 5వ తేదీన కేటాయిస్తారు.ఈ ఫేజ్ కింద సీటు పొందిన అభ్యర్థులు అక్టోబర్ 9వ తేదీలోపు కేటాయించిన కళాశాలలకు వెళ్లి ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ట్యూషన్ ఫీజు చెల్లించిన రశీదును సమర్పించి అడ్మిషన్ ప్రక్...