TG Court Recruitment 2026 : తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాల అప్డేట్ - హాల్ టికెట్లు విడుదల, డౌన్లోడ్ లింక్ ఇదిగో
భారతదేశం, జూన్ 18 -- Telangana Court Recruitment 2026 : తెలంగాణ సబార్డినేట్ కోర్టుల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు హైకోర్టు కీలక అప్డేట్ ఇచ్చింది. జుడీషియల్ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీస్ నిబంధనల ప్రకారం వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించబోయే కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షల (CBT) హాల్ టికెట్లను అధికారికంగా విడుదల చేసింది. ఈ పరీక్షలకు సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూల్ ను హైకోర్టు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ ఏడాది జనవరి 19న విడుదల చేసిన నోటిఫికేషన్ల ద్వారా జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ జూన్ 24వ తేదీ నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహించాలని హైకోర్టు నిర్ణయించింది.
...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.