భారతదేశం, నవంబర్ 25 -- తెలంగాణలో కొత్త పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటికే లక్షలాది మందికి సంబంధిత పత్రాలను అందజేశారు. నియోజకవర్గాల్లోని మండలాలు, గ్రామ పంచాయతీ కేంద్రాల్లో వీటిని పంపిణీ చేస్తున్నారు. అయితే వీరంతా కూడా తమ ఖాతాల్లోకి డబ్బులు ఎప్పుడు వస్తాయని ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వారికి తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ 26న (గురువారం) లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా పింఛన్ నగదును జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా 4.72 లక్షల మందికి కొత్త పించన్లను మంజూరు చేసింది. కొత్త పెన్షన్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి.. 360 డిగ్రీల కోణంలో విచారణ చేపట్ట...