భారతదేశం, మార్చి 7 -- ఇటీవలనే ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులను ఖరారు చేసిన తెలంగాణ సర్కార్. తాజాగా ఫార్మసీ కాలేజీల ఫీజులను కూడా ఫైనల్ చేసింది. బీ ఫార్మసీ, ఫార్మా-డీ, బీఆర్క్ కోర్సుల ఫీజులను ఖరారు చేస్తూ జీవో నెంబర్ 10ని జారీ చేసింది. ఫీజుల నియంత్రణ కమిటీ (TAFRC) పంపిన సిఫార్సులను పరిగణలోకి తీసుకున్న సర్కార్. ఈ జీవోను విడుదల చేసింది.

మరోవైపు ప్రస్తుతం టీజీ ఈఏపీసెట్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఎంట్రెన్స్ ద్వారా ఇంజినీరింగ్ మాత్రమే కాకుండా రాష్ట్రంలోని ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో కూడా ప్రవేశాలను కల్పిస్తారు. ఆయా కాలేజీల ఫీజుల విషయంలో ఇబ్బందులు తలెత్తున్న నేపథ్యంలో. ఈసారి ముందుగానే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రైవేట్, ఎయిడెడ్ కాలేజీల ఫీజులను ఖరారు చేసింది. ఫలితంగా విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు కూడా ఫీజుల విషయంలో స్పష్టమైన అవగాహ...