భారతదేశం, మార్చి 29 -- తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. మంత్రి పొంగులేటిని కేబినెట్ నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ నినాదాలు చేస్తోంది. ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు వెళ్తూ ప్లకార్డులు ప్రదర్శించి ఆందోళనకు దిగారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

ఆ తర్వాత సభలోనూ బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. స్పీకర్ పోడియం వద్ద నిరసన వ్యక్తం చేశారు. వెల్‌లోకి వెళ్లేందుకు యత్నించారు. అయితే వారిని మార్షల్స్ అడుకున్నారు.

బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనల నేపథ్యంలో అధికార పక్షం వైపు నుంచి కూడా రియాక్షన్ గట్టిగానే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ లో ప్రైవేటు పరిశ్రమ యజమాను...