భారతదేశం, మే 27 -- CM Revanth On Asara Pensions : రాష్ట్రంలోవని పెన్షన్ లబ్ధిదారులకు మరింత పారదర్శకంగా, వేగంగా సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులతో పాటు వివిధ వర్గాలకు అందిస్తున్న సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ విధానంలో మార్పులు తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు.

ప్రస్తుతం పోస్టల్ శాఖ ద్వారా సాగుతున్న పెన్షన్ల పంపిణీ పద్ధతికి స్వస్తి పలికి.. ఇకపై నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే (డీబీటీ విధానం) నగదు జమ చేయాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీఎం ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు.

నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయటం వల్ల ఎలాంటి అవకతవకలకు తావుండకూడదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పెన్షన్ కేవలం నిజమైన, అర్హులై...