TG Anganwadi Recruitment 2026 : అంగన్వాడీల్లో 15,982 ఉద్యోగాలు - జిల్లాల వారీగా నోటిఫికేషన్లు! ఖాళీల వివరాలు
భారతదేశం, జూన్ 23 -- Telangana Anganwadi Recruitment 2026 : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. మొత్తం 15,982 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలోని ఐసీడీఎస్ (ICDS) ప్రాజెక్టుల్లో ఉన్న ఖాళీలను మహిళా శిశు సంక్షేమ శాఖ ఇప్పటికే గుర్తించింది. ఈ మేరకు జిల్లాల వారీగా విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేసేందుకు స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది.
మొత్తం 15,982 ఖాళీల్లో 3,100 అంగన్వాడీ టీచర్ పోస్టులు ఉన్నాయి. మిగిలిన 12,882 పోస్టులు అంగన్వాడీ సహాయకురాలు (హెల్పర్స్) విభాగానికి చెందినవి. ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలో టీచర్ పోస్టులకు, మహబూబ్నగర్ జిల్లాలోని 4 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో టీచర్లు, సహాయకులు కలిపి మొత్తం 177 పోస్టుల ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.