భారతదేశం, జూలై 12 -- TG Rajiv Gandhi Civils Abhaya Hastham Scheme : తెలంగాణ రాష్ట్రానికి చెందిన సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) తీపి కబురు అందించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఏడాది కూడా 'రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం' పథకాన్ని కొనసాగిస్తున్నట్లు సింగరేణి సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (CMD) డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ పథకం కింద యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించి, మెయిన్స్ పరీక్షకు ఎంపికైన తెలంగాణ అభ్యర్థులకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు.

ఈ ఆర్థిక సాయం కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, అర్హత సాధించిన ప్రతి ఒక్కరికీ ల...