భారతదేశం, ఆగస్టు 18 -- Telangana 22A Prohibited Lands Registration : రాష్ట్రంలో ఏళ్ల తరబడి ప్రజలను వేధిస్తున్న 22-ఏ నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా సర్కార్ ఫోకస్ పెట్టింది. ప్రజల ఆస్తి హక్కులను పరిరక్షించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి నిషేధిత భూముల జాబితా, రిజిస్ట్రేషన్ల అంశంపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. భూ ఆస్తులున్న యజమానులు తమ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. రిజిస్ట్రేషన్ల కోసం ఆన్‌లైన్ ద్వారా స్లాట్ బుక్ ...