భారతదేశం, మే 21 -- Telangana Weather Report : బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. మధ్య బంగాళాఖాతం, నైరుతి బంగాళాఖాతం మీదుగా తమిళనాడు వరకు సగటు సముద్రమట్టం నుండి 3.1 కిలోమీటర్ల నుండి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఈ ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇదే సమయంలో రాష్ట్రంలోని పలు జిల్లాలను వడగాల్పులు ముంచెత్తనున్నాయి. ఒకేసారి వడగాల్పులు, వర్షాల హెచ్చరికలు జారీ కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం..ఇవాళ్టి నుంచి రేపు ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు. అంతేకాకుండా కొత్తగూడెం, వికారాబాద్...