భారతదేశం, ఏప్రిల్ 3 -- దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సగటు సముద్రమట్టానికి 1.5 నుంచి 3.1 కి.మీ ఎత్తులో ఇది విస్తరించి ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ ప్రభావంతో... తెలంగాణలో మరికొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం బులెటిన్ ప్రకారం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాబోయే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలలో పెద్దగా మార్పు ఉండదు. ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ) తో కూడిన వర్షాలు ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

ఏప్రిల్ 8, 9వ తేదీల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉం...