Telangana Weather : వినాయక చవితికి భారీ వర్షం.. తెలంగాణలో సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు వానలు!
భారతదేశం, సెప్టెంబర్ 7 -- తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ద్రోణి, బలహీనమైన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం మారనుంది. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు, ఈదురుగాలులు వచ్చే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు.
ఈసారి సెప్టెంబర్ 14న నిర్వహించనున్న వినాయక చవితి పండుగకు వర్షం ఎక్కువగా కురిసే అవకాశం ఉంది. వాతావరణ విశ్లేషకుడు టి. బాలాజీ (Telangana Weatherman) అందించిన సమాచారం ప్రకారం, సెప్టెంబర్ 12 నుంచే రాష్ట్రంలో ఉరుములతో కూడిన వర్షాలు ప్రారంభమవుతాయి. పండుగ సమయానికి వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉంది.
గణేష్ మండపాలను ఏర్పాటు చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.