భారతదేశం, ఏప్రిల్ 18 -- Rains in Telangana : ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. రాబోయే 5 రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది. ఈ మేరకు తాజాగా వెదర్ బులెటిన్‌ను విడుదల చేసింది.
పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది.
రాబోయే రెండు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని పేర్కొంది. అయితే.. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల అకస్మాత్తుగా గాలులు వీచి, వర్షం కురిసే సూచనలు ఉన్నాయని అంచనా వేసింది.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.