భారతదేశం, జూలై 12 -- తెలంగాణ వ్యాప్తంగా రాబోయే ఐదు రోజుల పాటు వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రయాణం ఒడిదొడుకులతోనే సాగుతోంది! జూన్ నెల ముగిసే సమయానికి దేశంలో దాదాపు 40 శాతం వర్షపాత లోటు నమోదైంది. ఇటీవలి కాలంలో ఇంత బలహీనమైన ప్రారంభం ఎప్పుడూ లేదు. జూన్ చివరి వారంలో... జులై మొదటి వారంలో పడిన భారీ వర్షాల వల్ల ఈ లోటు 14 శాతానికి తగ్గింది. జులై 9 నాటికి రుతుపవనాలు దేశమంతటా విస్తరించాయి. అయినప్పటికీ వర్షపాతం ఏకరీతిగా లేదు. పశ్చిమ, తూర్పు భారత ప్రాంతాల్లో మంచి వర్షాలు కురిసినా, మధ్య భారత రాష్ట్...