భారతదేశం, సెప్టెంబర్ 8 -- తెలంగాణ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వేలాది మంది నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు గడువును పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల విజ్ఞప్తులు దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(TSLPRB) విడుదల చేసిన నూతన ప్రకటన ప్రకారం, అభ్యర్థులు సెప్టెంబర్ 16వ తేదీ సాయంత్రం 5:00 గంటల వరకు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. నియామక ప్రకటన ప్రకారం తొలుత సెప్టెంబర్ 9వ తేదీని చివరి తేదీగా నిర్ణయించినప్పటికీ, తాజాగా ఆ గడువును మరో వారం రోజుల పాటు పొడిగించారు.

టీఎస్‌ఎల్‌ఆర్‌బీ జులై 29న విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా మొ...