Telangana PACS : రైతులకు గుడ్ న్యూస్.. కొత్తగా 240 సొసైటీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్!
భారతదేశం, నవంబర్ 18 -- రాష్ట్రంలోని గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలా నిలిచే సహకార రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 240 కొత్త ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను (PACS) ఏర్పాటు చేయడంతో పాటు, ఇప్పటికే ఉన్న సంఘాలను పునర్వ్యవస్థీకరించేందుకు తదుపరి చర్యలు చేపట్టాలని వ్యవసాయ, సహకార శాఖ అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం మెమోను జారీ చేసింది.
రాష్ట్రంలోని సహకార శాఖ ప్రత్యేక కమిషనర్, సహకార సంఘాల రిజిస్ట్రార్‌కు ఈ మెమో ద్వారా ప్రభుత్వం పూర్తి అధికారాలు కల్పించింది. వర్తించే చట్టాలు, నిబంధనలకు లోబడి కొత్త సంఘాల ఏర్పాటు.. పాత వాటి పునర్వ్యవస్థీకరణకు అవసరమైన ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించింది. క్షేత్రస్థాయిలో రైతుల అవసరాలకు అనుగుణంగా ఈ ప్రక్రియను పూర్తి చేసి తదుపరి చర్యలు తీసుకోవాల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.