భారతదేశం, జూన్ 26 -- New Telangana CS Sanjay Jaju : తెలంగాణ రాష్ట్ర పరిపాలనారంగంలో కీలక మార్పు చోటుచేసుకుంది. రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతం సీఎస్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రామకృష్ణారావు పదవీ కాలం ముగియనుండటంతో.. ఆయన స్థానంలో సంజయ్ జాజును ఎంపిక చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.

సంజయ్ జాజు 1992 బ్యాచ్‌కు చెందిన ఐఎఎస్ అధికారి. ఇప్పటివరకు కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయన సేవలను రాష్ట్రానికి కేటాయించాలంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ప్రత్యేకంగా అభ్యర్థించింది. ఈ అభ్యర్థనను పరిశీలించిన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ నియామకాల కమిటీ . ఆయనను తిర...