Telangana Meeseva : ఇకపై నో రిసిప్ట్....! మీసేవా కేంద్రాల్లో కొత్త రూల్స్, వీటిని తెలుసుకోండి
భారతదేశం, జూన్ 18 -- TG Meeseva digital receipt Rules : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీసేవ కేంద్రాల ద్వారా వివిధ రకాల ప్రభుత్వ సేవలు పొందే దరఖాస్తుదారులకు ఐటీ శాఖ కీలక సమాచారం అందించింది. మీసేవా కేంద్రాల్లో ఇప్పటివరకు దరఖాస్తుదారులకు అందజేస్తున్న కాగితపు (భౌతిక) రసీదుల ప్రక్రియను పూర్తిగా నిలిపివేయనున్నారు.
డిజిటల్ సేవలను మరింతగా ప్రోత్సహించడంతో పాటు కాగితం వాడకాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19 (శుక్రవారం) నుంచి రాష్ట్రంలోని అన్ని కేంద్రాల్లో కాగితపు రసీదుల జారీని పూర్తిగా బంద్ చేయనున్నారు. ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇకపై మీసేవా కేంద్రాల్లో ఎవరైనా ఏ సర్వీసు కోసమైనా దరఖాస్తు చేసుకుంటే, వారికి ఎలాంటి ప్రింటెడ్ రసీదు ఇవ్వరు. దరఖాస్తు ప్రక్రియ పూర్తి కాగానే, దరఖాస్తుదారుడి మొబైల్ ఫోన్ నంబర్‌కు ఎస్ఎంఎస్ (SMS)...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.