భారతదేశం, ఏప్రిల్ 24 -- వేసవికాలం కావటంతో.. సెలవుల సీజన్ నడుస్తోంది. ఈ వీకెండ్‌లో సరదాగా ఫ్యామిలీతో కలిసి మెట్రోలో షికారు చేయాలన్నా, ఏదైనా ప్రముఖ ఆలయాన్ని సందర్శించాలన్నా, లేక పిల్లలతో కలిసి పార్కులు, మ్యూజియంలు, గోల్కొండ కోట వంటి చారిత్రక కట్టడాలను చూడాలనుకున్నా అందరికీ గుర్తొచ్చే మొదటి సమస్య 'క్యూ లైన్లు'.! ఎండ తీవ్రతలో టికెట్ కౌంటర్ల దగ్గర గంటల తరబడి నిరీక్షించడం ఎంతో విసుగును కలిగిస్తుంది. కానీ ఇకపై ఆ చింత అక్కర్లేదు. మీ స్మార్ట్ ఫోన్‌లో ఒక్క క్లిక్ చేస్తే చాలు.. మీ వీకెండ్ ప్లాన్ మొత్తం సాఫీగా సాగిపోతుంది.

రాష్ట్ర ఐటీ శాఖ పరిధిలోని 'మీ సేవా' (Mee Seva) విభాగం ప్రవేశపెట్టిన మీ టికెట్ (Mee Ticket) యాప్ ఇప్పుడు పౌర సేవల్లో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. "టికెట్ ఏదైనా - యాప్ ఒక్కటే" అనే నినాదంతో వస్తున్న ఈ అప్లికేషన్ ద్వారా ఇంటి నుంచే ...