భారతదేశం, సెప్టెంబర్ 1 -- Telangana Inter Admissions 2026 : తెలంగాణలో ఇంటర్ ప్రవేశాల కోసం చూస్తున్న విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు మరో అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రంలోని అన్ని రకాల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు ఉద్దేశించిన ప్రవేశాల గడువును ఈనెల 7 వరకు పొడిగించింది. అడ్మిషన్ల ప్రక్రియకు ఇదే చివరి అవకాశమని, దీని తర్వాత మరే కారణం చేతనైనా గడువు పొడిగించేది లేదని స్పష్టం చేసింది.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్, ఎయిడెడ్ కళాశాలలతో పాటు సాంఘిక, గిరిజన, మైనారిటీ సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాలలు, తెలంగాణ మోడల్ స్కూల్స్, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ) అన్నింటికీ ఈ విస్తరించిన గడువు వర్తిస్తుంది. విద్యార్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా, వీలైనంత త్వరగా తమకు నచ్చిన, అర్హత ఉన్న కళాశాలల్లో సీటును ఖ...