భారతదేశం, మార్చి 23 -- వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఉద్యోగులకు కోత పడనుంది. ఆ దిశగా తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. ప్రాథమికంగా ప్రతిపాదనలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 10 శాతం వరకు వేతనాల్లో కోత విధించే అవకాశం ఉందని సమాచారం.

వేతనాల్లో కోత విధించే ప్రతిపాదనను ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలో పరిశీలించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో. ఈ ప్రతిపాదనపై నేటి కేబినెట్ భేటీలో చర్చించి. ఓ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సభ ముందుకు తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం.

ఆర్థికంగా సురక్షితమైన కుటుంబాలలో కూడా వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. కొందరు ఉద్యోగులైతే. వారి తల్లిదండ్రుల విడిచిపెట్టడంతో. అలాంటి వారి పరిస్థితులు ఆందోళనకరంగా మారు...