భారతదేశం, అక్టోబర్ 20 -- డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యంగా తెలంగాణ ఈగల్‌ ఫోర్స్‌ దూకుడు పెంచింది. అంతర్రాష్ట్ర సరిహద్దులు దాటి విస్తరించిన డేంజరస్ సింథటిక్ డ్రగ్స్ తయారీ స్థావరాన్ని, దాని వెనుకున్న అక్రమ నెట్‌వర్క్‌ను చేధించింది. మహారాష్ట్రలోని గోండియా జిల్లా మహారాజ్‌గాం గ్రామంలో గల ఒక కోడి ఫామ్‌లో రహస్యంగా నిర్వహిస్తున్న రసాయన డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని బట్టబయలు చేసింది.

ఈ కేసులో మొత్తం 24 మంది నిందితులను గుర్తించగా, ఇప్పటికే 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరో 13 మంది పరారీలో ఉన్నారు. కారు తనిఖీతో వెలుగులోకి వచ్చిన దందాలో కీలక విషయాలు వెలుగు చూశాయి.

యాదాద్రి భువనగిరి జిల్లా కొండమడుగు నుంచి నాగపూర్ వైపు అతివేగంగా వెళ్తున్న ఒక తెల్లటి ఎస్‌యూవీ (SUV) వాహనాన్ని బీబీనగర్ పోలీసులు దారిమధ్యలో అడ్డుకున్నారు. కార్లలో తనిఖీలు చేపట్టగా దాదాపు 27....