భారతదేశం, మే 8 -- Telangana BC caste name changes : రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల అభ్యర్థనలు, వారి సామాజిక గౌరవాన్ని పరిగణనలోకి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ కమిషన్ సమర్పించిన సిఫార్సుల మేరకు రాష్ట్ర కేబినెట్ పలు కులాల పేర్లలో మార్పులు చేసేందుకు, అలాగే మరికొన్ని కులాలకు పర్యాయపదాలను జోడించేందుకు ఆమోద ముద్ర వేసింది. ప్రధానంగా గ్రూప్-ఏ, గ్రూప్-డి విభాగాల్లోని పలు వరుస సంఖ్యల్లో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి.

సామాజికంగా వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన సుదీర్ఘ కాలపు విన్నపాలను పరిశీలించిన అనంతరం.. వారి మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెలువరించింది. ఈ మేరకు బీసీ జాబితాలో చేసిన మార్పుల వివరాలను రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.

ఈ మార్పుల వల్ల ఆయా కులాలకు చెందిన ప్...