Telangana ACB Raid : మెప్మా అదనపు డైరెక్టర్‌పై ఏసీబీ సోదాలు - భారీగా అక్రమాస్తుల గుర్తింపు
భారతదేశం, నవంబర్ 4 -- మెప్మా (MEPMA) సంస్థలో కీలక అధికారిగా ఉన్న అదనపు డైరెక్టర్ నల్లగుంట్ల యాదగిరిరావు ఏసీబీ వలకు చిక్కారు. సర్వీసులో ఉండగా తన అధికారిక హోదాను అడ్డుపెట్టుకుని అవినీతి, అక్రమ మార్గాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఆయనపై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల (DA) కేసును నమోదు చేశారు.
కేసునమోదులో భాగంగా మంగళవారం ఏసీబీ అధికారులు హైదరాబాద్‌లోని ఆయన నివాసం, ఆఫీసు, బ్యాంక్ లాకర్లతో పాటు బంధువులు, సన్నిహితులు, బెనామీల ఇళ్లతో కలిపి మొత్తం 10 ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా ఆస్తులను గుర్తించారు.
ఏసీబీ సోదాల్లో భారీ ఎత్తున స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు లభ్యమయ్యాయి. హైదరాబాద్ , సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో 12 ఓపెన్ ప్లాట్లు (విలువ రూ. 58.63 లక్షలు), హైదరాబాద్ ఉప్పల్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.