భారతదేశం, జూలై 3 -- తెలంగాణ పోలీస్‌ కంప్యూటర్‌ సర్వీసెస్‌ (PCS) విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా విధులు నిర్వహిస్తున్న సంకిరెడ్డి భీమ్ రెడ్డిపై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. తన అధికారిక హోదాను దుర్వినియోగం చేస్తూ... అవినీతి మార్గాల ద్వారా ఆయన భారీగా స్థిర, చర ఆస్తులను కూడబెట్టినట్లు వచ్చిన సమాచారం మేరకు ఈ దాడులు జరిగాయి.

జూలై 2, 2026 న ఏసీబీ ప్రత్యేక బృందాలు గచ్చిబౌలిలోని డీఎస్పీ నివాసంతో పాటు ఆయన బంధువులు, స్నేహితులు, బినామీలకు చెందిన దాదాపు 15 వేర్వేరు ప్రాంతాల్లో ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టాయి. మార్కెట్ విలువ ప్రకారం. వందల కోట్ల రూపాయలు పలికే భారీ ఆస్తుల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

స్థిరాస్తులతో పాటు డీఎస్పీ భీమ్ రెడ్డి ఇల్లు. ఆయన బినామీ ఇళ్లలో జరిపిన తనిఖీల్లో భారీగా నగదు...