Telangana ACB : ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్‌పై ఇళ్లపై ఏసీబీ సోదాలు - భారీగా అక్రమాస్తులు..!
భారతదేశం, జూన్ 9 -- అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతికి పాల్పడే అధికారులపై తెలంగాణ ఏసీబీ ఉక్కుపాదం మోపుతోంది. గత కొంతకాలంగా దూకుడుగా ముందుకెళ్తున్న ఏసీబీ. చాలా మంది అవినీతి అధికారులను అరెస్ట్ చేసింది. తాజాగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ (R&B) ఇంజినీర్-ఇన్-చీఫ్ మోహన్ నాయక్ ఇళ్లపై సోదాలు జరిపింది. తెల్లవారుజాము నుంచే ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆయనపై ఫోకస్ పెట్టారు. ప్రాథమిక అంచనాల ప్రకారం మోహన్ నాయక్ అక్రమాస్తుల విలువ రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం.
మాధాపూర్‌లో ఉన్న బాలునాయక్ ప్రధాన నివాసంతో పాటు తెలంగాణవ్యాప్తంగా మొత్తం 11 విభిన్న ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నాయి. ఆయనకు సంబంధించిన కార్యాలయాలు, బంధువులు, అత్యంత ఆప్తులకు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.