భారతదేశం, సెప్టెంబర్ 18 -- Telangana 22A Lands Issue : తెలంగాణలో భూముల కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో ఎంతోమంది ప్రజలను, రైతులలో గందరగోళానికి గురిచేస్తున్న 22ఏ (నిషేధిత భూముల జాబితా) సమస్యల పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమస్యను సమగ్రంగా అధ్యయనం చేసి, క్షేత్రస్థాయిలో ఉన్న చిక్కుముళ్లను విప్పేందుకు వీలుగా ప్రభుత్వం ఒక అత్యున్నత స్థాయి కమిటీని (హైలెవల్ కమిటీ) గురువారం ఏర్పాటు చేసింది.

ముగ్గురు ఐఏఎస్, ఉన్నతాధికారులతో కూడిన ఈ కమిటీ బాధ్యతలను స్వీకరించనుంది. ఈ కమిటీకి ఛైర్మన్‌గా సీసీఎల్‌ఏ (భూపరిపాలన ప్రధాన కమిషనర్) వ్యవహరిస్తారు. కమిటీలో సభ్యులుగా రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి, అలాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీలు బాధ్యతలు నిర్వర్తిస్తారు.

రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చట్టం పరిధిలోని 22ఏ జాబితాలో చేర్చడం వల్...