భారతదేశం, అక్టోబర్ 19 -- Telangana Assistant Professor Recruitment 2026 : రాష్ట్రంలోని ఉన్నత విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న ఏడు విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల (సహాయ ఆచార్యులు) నియామక ప్రక్రియకు చివరకు మార్గం సుగమమైంది. యూనివర్సిటీల్లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఖాళీల భర్తీకి అనుమతినిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు (జీవో 141) జారీ చేసింది. మొత్తం 429 పోస్టులను ఈ విడతలో భర్తీ చేయనున్నారు.

ఉన్నత విద్యామండలి సమర్పించిన వివరాల ఆధారంగా ఆర్థిక శాఖ వర్సిటీల వారీగా ఖాళీలను ఖరారు చేసింది. అత్యధికంగా హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో (ఓయూ) 252 పోస్టులు ఉన్నాయి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాలకు 16 చొప్పున పోస్టులు దక్కాయి. అయితే డిచ్‌పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయాన...