భారతదేశం, అక్టోబర్ 14 -- Telangana Voter Registration Special Camps : రాష్ట్రంలోని అర్హులైన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం రంగంలోకి దిగింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా... జాబితాలో పేర్లు లేని వారు, తొలిసారి ఓటు హక్కు పొందే యువత కోసం అక్టోబర్ 15, 16 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.

"అర్హత ఉన్న ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయడం, అర్హత లేని వారి పేర్లను తొలిగించడమే తమ ప్రాథమిక లక్ష్యం," అని సీఈఓ స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా అధికారులకు ఆయన స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశారు.

అక్టోబర్ 15, 16 తేదీల్లో ఉదయం నుంచే అన్ని పోలిం...