భారతదేశం, మార్చి 25 -- రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారుల ఆందోళన నేపథ్యంలో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పందించింది. పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న వదంతులు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేసింది. ఇంధన కొరత ఉందనేది కేవలం తప్పుడు వార్త అని తెలిపింది. ప్రజలు అనవసరంగా బంకుల వద్ద క్యూ కడుతున్నారని అభిప్రాయపడింది.

​ ప్రస్తుతం HPCL, IOCL, BPCL వంటి కంపెనీల వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ క్లారిటీ ఇచ్చింది. సరఫరా గొలుసు (Supply chain) ఎక్కడా ఆగలేదని పేర్కొంది. అనవసరం ​భయం వల్ల ప్రజలు ఒక్కసారిగా కొనుగోలు చేయడం వల్ల సాధారణం కంటే 2.5 నుండి 3 రేట్లు విక్రయాలు పెరిగాయని వివరించింది. దీనివల్ల కొన్ని బంకుల్లో తాత్కాలికంగా స్టాక్ అయిపోవచ్చు.. కానీ అది కొరత కాదని స్పష్టం చేసింది.

​"పెట్రోల్ లేదా డీజిల...