Telangana : ఆటో కార్మికులకు మరో శుభవార్త - త్వరలోనే సంక్షేమ బోర్డు, రూ.1.50 లక్షల సబ్సిడీ కూడా..!
భారతదేశం, అక్టోబర్ 4 -- ఆటో కార్మికుల్లో ఆనందం నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసేందుకు సిద్ధమైంది. రవాణా రంగంలో కష్టపడుతున్న డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను మానవీయ కోణంలో పరిష్కరించేందుకు ప్రత్యేక సంక్షేమ బోర్డును త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది.ఈ మేరకు మంత్రులు కీలక ప్రకటన చేశారు,
ఇటీవలనే ఆటో ఛార్జీలను పెంచుతూ జీవో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శనివారం ప్రజాభవన్లో ఆటో డ్రైవర్ల సంఘాల నాయకులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారితో కలసి ఆత్మీయ విందులో పాల్గొని, వారి క్షేత్రస్థాయి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సమస్య ఏదైనా సరే మానవీయ దృక్పథంతో పరిష్కరించడమే ప్రజా ప్రభుత్వ నైజమని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు.
ఇటీవల ఆటో డ్రైవర్ల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.