భారతదేశం, అక్టోబర్ 13 -- రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోమవారం సాయంత్రం సోదాలు నిర్వహించారు. హెచ్‌ఎండీఏ (HMDA) నిబంధనల ప్రకారం భూమిని సర్వే చేసి, జాయింట్ ఇన్‌పెక్షన్ సర్వే నివేదికను జారీ చేయడానికి పెద్దమొత్తంలో లంచం డిమాండ్ చేసిన అధికారుల గుట్టును రట్టు చేశారు. బాధితుడి నుంచి రూ.20 లక్షల లంచం తీసుకుంటుండగా మండల సర్వేయర్ బటుక శ్రీనివాసులతో పాటు ఎమ్మార్వోను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఈ భారీ లంచం డిమాండ్ వ్యవహారంలో అబ్దుల్లాపూర్‌మెట్ మండల తహసీల్దార్ బి. సుదర్శన్‌రెడ్డికి నేరుగా ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లభించాయి. దీంతో ఆయనను కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చి అరెస్టు చేశారు.

ఏసీబీ అధికారులు విడుదల చేసిన ప్రకటనలోని వివరాల ప్రకారం.. భూ సర్వే నివేదిక ఇవ్వడానికి నిందితులు ప...