భారతదేశం, మార్చి 25 -- ఇంధన కొరతతో పెట్రోల్ బంకులు మూతపడతాయనే ప్రచారంతో వాహనదారులు బంకుల వద్దకు పోటెత్తారు. మంగళవారం హైదరాబాద్ లోని చాలా పెట్రోల్ బంకుల వద్ద బారులు కనిపించాయి. కొన్నిచోట్ల నో స్టాక్ బోర్డులు కూడా కనిపించాయి.

ఈ పరిస్థితులపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ క్లారిటీ ఇచ్చింది.రాష్ట్రంలో ఎక్కడా డీజిల్, పెట్రోల్, ఎల్పీజీ కొరత లేదని స్పష్టం చేసింది. అన్ని జిల్లాల్లో సరిపడా నిల్వలు ఉన్నాయని ఓ ప్రకటన ద్వారా పేర్కొంది.

పెట్రోల్, డీజిల్షార్టేజీ అంటూ వచ్చిన వదంతుల నేపథ్యంలో చాలా బంకుల వద్ద భారీ క్యూలైన్లు కనిపించాయని తెలిపింది. అనవసరమైన భయాందోళనల ఫలితంగా ఈ తరహా కృతిమ కొరతకు దారి తీసిందని పేర్కొంది.

ఇందన కొరత వదంతుల నేపథ్యంలో వాహనదారులు తమ వాహనాల ట్యాంకులను పూర్తిగా నింపుకోవడానికి పరుగులు తీయడం వల్లే ఈ కృత్రిమ కొరత ఏర్పడుతోందని పౌరసరఫరాల శాఖ ...