భారతదేశం, ఏప్రిల్ 23 -- Tata Capital Q4 results: విశ్వసనీయతకు మారుపేరైన టాటా గ్రూప్ నుంచి వస్తున్న ఆర్థిక సేవల సంస్థ 'టాటా క్యాపిటల్', మార్కెట్ అంచనాలను మించి రాణించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక (Q4 FY26) ఫలితాలను గురువారం ప్రకటించిన కంపెనీ, లాభాల్లో భారీ జంప్‌ను నమోదు చేసింది. ముఖ్యంగా సామాన్యులకు, మధ్యతరగతి వ్యాపారులకు రుణాల పంపిణీలో దూసుకుపోతున్న ఈ సంస్థ, తాజా ఫలితాలతో తన పట్టును మరింత బలోపేతం చేసుకుంది.

గత ఏడాది ఇదే త్రైమాసికంలో (జనవరి-మార్చి 2025) టాటా క్యాపిటల్ నికర లాభం రూ. 999.81 కోట్లుగా ఉండగా, ఇప్పుడు అది 46.65 శాతం పెరిగి రూ. 1,466.27 కోట్లకు చేరుకుంది. కేవలం ఏడాది ప్రాతిపదికన మాత్రమే కాకుండా, క్రితం త్రైమాసికం (QoQ)తో పోల్చినా లాభం 15.93 శాతం మెరుగుపడటం గమనార్హం. దేశవ్యాప్తంగా పెరిగిన రుణ వినియోగం, పటిష్టమైన ...